ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'OG' షూటింగ్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 03:39 PM

సుజీత్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'OG' అనే టైటిల్ ని లాక్ చేసారు. కేవలం ఒక నెల షూటింగ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ ని కేటాయించినట్లు సమాచారం. మే మూడవ వారంలో నటుడు ఈ సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, షామ్ మరియు హరీష్ ఉత్తమన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa