ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ సేతుపతి జోడిగా ధన్సిక

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 01:56 PM

సాయి ధన్సిక పేరు చెప్పగానే 'కబాలి' సినిమాలో రజనీకాంత్ కూతురుగా .. మాఫియా గ్యాంగ్ కి చెందిన వ్యక్తిగా ఆమె పోషించిన పాత్ర గుర్తుకు వస్తుంది. నటనతో పాటు నాజూకుతనం పుష్కలంగా వున్న ఈ అమ్మాయికి యూత్ లో మంచి క్రేజ్ వుంది. హీరోయిన్ గా సరైన ఛాన్స్ కోసం ఆమె కొంత కాలంగా ఎదురుచూస్తోంది. తాజాగా ఆమెకి అలాంటి ఛాన్స్ దొరికేసింది. 


తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'లాబమ్' అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా శృతిహాసన్ నటిస్తోంది. మరో కథానాయికగా సాయి ధన్సికను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతి సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇమాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa