బాలీవుడ్ సెక్సీ స్టార్ సన్నీ లియోన్ ఏది చేసినా సంచలనమే.. అటు నటనతో, ప్రత్యేక గీతాల్లో నర్తిస్తూ దూసుకుపోతున్న ఈ హాట్ భామ నెట్టింట్లోనూ తానే స్టార్ అంటోంది. సోషల్ మీడియాలో, వార్తల్లో ట్రెండ్ అవుతున్న ఈ భామ.. గూగుల్ ఇండియా సెర్చింగ్‌లోనూ తానే టాప్ అని జెండా ఎగరేస్తోంది. పోర్న్ స్టార్ ముద్రను ఇప్పుడిప్పుడే తొలగించుకుంటున్న ఈ బ్యూటీ.. గూగుల్ ట్రెండ్స్ అనలైటిక్స్‌లో దూసుకుపోతోంది. ఎంతలా అంటే.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఖాన్ దిగ్గజాలు.. షారుక్, సల్మాన్‌లను కూడా వెనక్కి నెట్టేసింది. గూగుల్ అనలైటిక్స్‌లో ఆమె వీడియోలు సహా తానే స్వయంగా నటించిన.. బయోపిక్ ‘కరణ్‌జిత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ నెట్టింట్లో రఫ్ఫాడించేస్తున్నాయి.
ముఖ్యంగా ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్, అస్సాం రాష్ట్రాల ప్రజలు సన్నీ లియోన్‌ను బాగా సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చింగ్‌లో మీరే ట్రెండ్ అవుతున్నారని, దీనిపై స్పందించాలని సన్నీ లియోన్‌ను కోరగా.. ఈ మధ్యే తనకూ తెలిసిందని, తనపై ఇంత అభిమానాన్ని చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అని తెలిపింది. ఈ ఫీలింగ్ చాలా గొప్పదని వ్యాఖ్యానించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa