ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ "కార్తికేయ-2" నిజమా ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 04:47 PM

యంగ్ హీరో నిఖిల్ పళనిలోని సుప్రసిద్ధ ఆలయంలో కార్తికేయ దర్శనం చేసుకున్నాడు. అదే పేరుతో గతంలో తనకో పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు చందు మొండేటితో కలిసి వెళ్లిన ఫోటోని మీడియాతో షేర్ చేసుకున్నాడు నిఖిల్. కార్తికేయ 2 త్వరలోనే ఉండొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఇప్పుడీ పర్యటన దానికి బలం చేకూర్చింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు మొదలుకావొచ్చన్న దాని మీద ఇంకా స్పష్టత లేదు.


ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కానీ స్క్రిప్ట్ ఇంకా మెరుగులుదిద్దుకునే స్టేజి లో ఉందట. దానికన్నా ముందు చందు మొండేటి శర్వానంద్ తో ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా ఇన్ సైడ్ టాక్. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది. నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ నేపథ్యంలో నిర్మాతలు సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.


పెర్ఫార్మన్స్ పరంగా తన కెరీర్ బెస్ట్ గా ఈ మూవీ నిలుస్తుందని నిఖిల్ ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. అభిమానులు సైతం కిరాక్ పార్టీ తర్వాత నిఖిల్ సినిమా స్క్రీన్ మీద చూడనే లేదు. అందుకే వాళ్ళ ఎదురు చూపులకు కూడా బ్రేక్ దొరకాల్సి ఉంది. సబ్జెక్ట్ సెలక్షన్ లో వైవిధ్యం పాటించే నిఖిల్ ఆలస్యమైనా మంచి కథలతో వస్తానంటున్నాడు. మరి కార్తికేయ కొనసాగింపు ఎప్పుడు మొదలవుతుందో హీరో దర్శకులే చెప్పాలి. దానికి కొంచెం టైం పట్టేలా అయితే ఉంది. అప్పటిదాకా వేచి చూద్దాం.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa