'రాక్షసుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. తమిళ సినిమా 'రాచ్చసన్'కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో శ్రీనివాస్, సురేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా 'రాక్షసుడు' విజయంతో ఆనందంలో మునిగితేలుతున్న తన కుమారుడి పెళ్లి గురించి సురేశ్ ప్రస్తావించారు. 'త్వరలోనే శ్రీనివాస్ వివాహం జరగబోతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన అమ్మాయిని కాకుండా.. బయట నుంచి వాడికి తగిన అమ్మాయి కోసం చూస్తున్నా. 'రాక్షసుడు' సినిమాను సక్సెస్ చేసిన తెలుగు వారికి ధన్యవాదాలు. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌తో పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నా. ఇప్పటికే స్క్రిప్టు పని మొదలైంది. సరైన దర్శకుడికి కోసం వెతుకుతున్నా. శ్రీనివాస్ పాత సినిమాలు బాక్సాఫీసు వద్ద రూ.40 కోట్ల వరకూ రాబట్టాయి. కానీ ఆ సినిమాల్ని అధిక బడ్జెట్‌తో నిర్మించడం వల్ల ఫెయిల్యూర్‌గా నిలిచాయి. కాబట్టి బడ్జెట్‌ను నియంత్రణలో ఉంచుకుంటే సినిమా హిట్‌కు ఆస్కారం ఉంటుంది' అని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa