రాజేంద్రప్రసాద్, అర్చన కాంబినేషన్‌లో రూపేశ్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్టిపూర్తి’. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి ప్రాచుర్యం పొందాయి. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘షష్టిపూర్తి’ నేపథ్యoలో సాగే ‘వేయి వేణువుల నాదం మోగే’ పాటను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేసి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. కార్తీక్, విభావరి ఆప్టే జోషి ఆలపించారు. స్వర్ణ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు.అనంతరం ఈ పాట గురించి దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ.. ‘వేయి వేణువుల నాదం మోగే హాయి హాయి హృదయాన! ప్రేమ మంత్రముల గానం సాగే ఈ ముహూర్త సమయాన! సరాదలే సరిగమలై పలికిన శుభవేళ.. అరవై లో ఇరవైలా విరిసిన వరమాల...’’ అంటూ సాగే ఈ గీతాన్ని చైతన్య ప్రసాద్ అద్బుతంగా రాశారని, ఇకపై ఎవరు ‘షష్టిపూర్తి’ జరుపుకున్న ఈ పాటను ప్లే చేసి తీరాల్సిందేన్నారు. ఇళయరాజా గారి సమక్షంలో ఈ పాట రికార్డింగ్ ని ప్రత్యక్షంగా వీక్షించి పులకించి పోయానని తెలిపారు.ఈ పాట కోసం కళా దర్శకుడు తోట తరణి ఓ మండువ లోగిలిని అత్యద్భుతంగా తీర్చి దిద్దారని. నిజంగా ఓ పెళ్లి వేడుకలో ఉన్నపుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో, ఈ పాట చూస్తున్నపుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన , మా రూపేష్, ఆకాంక్ష సింగ్ లు ఈ పాటలో నిజంగా జీవించారని, చాలా కాలం గుర్తుండి పోయే పాట ఇదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa