డైరెక్టర్ వెంకీ అట్లూరి, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ లాంచింగ్ కార్యక్రమానికి చిత్రబృందం హాజరైంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, మిగతా యూనిట్ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్టును సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa