మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'భైరవం'. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం ఏలూరులో జరిగింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకుడు. ఇక, ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈవెంట్‌లో ఆయనపై ఓ వీడియో (ఏవీ) ప్రదర్శించగా.. అది చూసి మంచువారబ్బాయి చలించిపోయాడు. ఎమోషన్ ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు. సొంతవాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు తనపై ప్రేమ కురిపిస్తున్నారని ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa