కొన్నిసార్లు కొందరికి రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వస్తుంటుంది. అది ఆ సమయం వరకు మాత్రమే ఉండి.. ఆ తర్వాత కనిపించమన్నా కూడా కనిపించదు. కౌశల్ విషయంలో కూడా ఇదే జరిగింది. బిగ్ బాస్ 2 జరుగుతున్నపుడు ఈయన కోసం అభిమాన సంఘాలు కూడా వచ్చాయి. అసలు కౌశల్ కోసం ఆర్మీ తయారు కావడం ఏంటి.. పిచ్చి కాకపోతేనూ అంటూ అంతా ఆశ్చర్యపోయారు. కానీ నిజంగానే ఆయన కోసం అన్నాదానాలు, పాదయాత్రలు ఇలా అన్నీ చేసారు అభిమానులు. తీరా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కనీసం పట్టించుకోవడం మానేసారు. కౌశల్ ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడనే విషయంపై ఇప్పుడు ఆరా తీయడం కూడా మానేసారు. ఆ టైమ్ వరకే కౌశల్ ఆర్మీ పని చేసింది. కానీ బిగ్ బాస్ తర్వాత కచ్చితంగా కౌశల్ వరస సినిమాలు చేస్తాడని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ ఏడాది కాలంగా ఎక్కువగా మీడియా ముందుకు కూడా రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన తన ఫ్యూచర్ గురించి కీలకమైన ప్రకటన చేసాడు. సినిమాలు ఎందుకు చేయడం లేదన్న వాళ్లకు సమాధానంగా తన భార్య ఆరోగ్యం బాగోలేదని.. ఆమె తర్వాతే సినిమాలు అంటూ రిప్లై ఇచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa