తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయింది సీనియర్ నటి టబు. వయసు 45 దాటుతున్నా టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. అసలు తను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఓ హీరో అని చెబుతోంది టబు. ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్. అజయ్‌తో తనది ప్రత్యేకమైన అనుబంధమని, అతని వల్లే తను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది టబు.
‘గతంలో మా కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడు. అజయ్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. అప్పట్లో నేను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అవుతూ ఉండేవాడు. నన్ను ఓ కంట కనిపెడుతూ ఉండేవాడు. వేరే అబ్బాయిలు నాతో మాట్లాడినా, నన్ను చూసినా వాళ్లను కొట్టేవాడు. అజయ్ వల్లే ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయా. ఈ విషయాన్ని అతను ఇప్పటికైనా తెలుసుకుంటాడని ఆశిస్తున్నా. హీరోల్లో నాకు అజయ్ అంటేనే ఇష్టం. మా బంధం చాలా స్పెషల్. నేను చిన్నపిల్లలా ప్రవర్తించినా అజయ్ నన్ను చాలా బాగా చూసుకుంటాడ’ని చెప్పింది టబు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa