కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది మలయాళ కుట్టి అమలాపాల్. చిన్న వయసులోనే దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడిన అమల.. అతణ్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ బంధం ఎంతో కాలం సాగలేదు. భర్త నుంచి విడాకులు తీసుకున్న అమల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ధనుష్‌తో ‘వీఐపీ-2’ (రఘువరన్ బీటెక్)లో నటిస్తోంది.తొలి భాగంలో ధనుష్‌కు ప్రియురాలిగా కనిపించిన అమల.. రెండో భాగంలో భార్యగా నటిస్తోందట. అయితే ధనుష్‌ను ముప్పుతిప్పలు పెట్టే గయ్యాళి భార్యగా కనిపించనుందట. ఒకవేళ ‘వీఐపీ-3’ కనుక తీస్తే అందులో ధనుష్‌కు మంచి భార్యగా నటిస్తానని అంటోంది. అసలు, ‘వీఐపీ’కి మూడో భాగం ఉందో, లేదో కూడా తెలియదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa