ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కౌసల్య కృష్ణమూర్తి" ప్రీ రిలీజ్ కు.. దేవరకొండ, రాశిఖన్నా

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 01:44 PM

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై భీమనేని శ్రీనివాసరావు క్రికెట్ నేపథ్యంలో 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాను రూపొందించాడు. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్ లోని జెఆర్సీ బాల్ రూమ్ లో రేపు సాయంత్రం ఈ వేడుకను జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ - రాశి ఖన్నా హాజరు కానున్నారు.


ఓ కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించగా, ప్రత్యేకమైన పాత్రలో శివకార్తికేయన్ కనిపించనున్నాడు. తమిళంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్, ఈ సినిమాతో తెలుగులోను తన కెరియర్ జోరందుకుంటుందని భావిస్తోంది. ఆమె నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa