ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ముగ్గురికి నా ధన్యవాదాలు : అడవి శేష్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 03:03 PM

సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ కథా చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్‌. ‘క్షణం’, ‘గూఢచారి’ తరువాత ఇటీవల విడులైన ‘ఎవరు’ చిత్రంతో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. శేష్‌ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సినీ రంగంలో మొదటి నుంచి తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్‌, సమంత తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారన్నారు. ఆ సందర్భంగా ఆ ముగ్గురికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అడివి శేష్‌ ‘ఎవరు’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అనంతరం ఆయన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్ ‌ఎస్ సంస్థలు సంయుక్తంగా‌ నిర్మించబోతున్న ‘మేజర్‌’ చిత్రంలో నటించనున్నారు. ఇటీవల మహేష్‌బాబు ఈ చిత్రానికి సంబంధించి అడివి శేష్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ గెటప్‌లో అడివి శేష్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa