తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులకు తోడుగా పలువురు సినీ ప్రముఖుల పేరుతోనూ అవార్డులు ఏర్పాటు చేసింది. ఆరుగురు సినీ ఉద్ధండుల పేర్లతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులను కూడా గద్దర్ అవార్డుల జ్యూరీ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించగా.. పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డును ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును దర్శకుడు సుకుమార్, నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa