శ్రీవిష్ణు హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘#సింగిల్’. OTTలోకి సైలెంట్‌గా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్ అవుతోంది. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో విడుదలై ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించింది....విజయ్ (శ్రీవిష్ణు) ఎస్‌డీఎఫ్ బ్యాంక్‌లో ఇన్స్యూరెన్స్ విభాగంలో పని చేస్తుంటాడు. అదే బ్యాంక్‌లో పని చేసే తన మిత్రుడు అరవింద్ (వెన్నెల కిషోర్) ఓ అమ్మాయిని ప్రేమించి.. పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ విషయంలో అరవింద్‌కు సాయం చేస్తుండగా మెట్రోలో పూర్వ (కేతిక శర్మ)ను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్. ఓ కారు షోరూంలో పని చేసే ఆమెని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఓ ప్రణాళిక రచించగా.. అది బెడిసి కొడుతుంది. ఈ క్రమంలోనే డ్యాన్సర్ హరిణి (ఇవానా) తన జీవితంలోకి వస్తుంది. ఓవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే.. మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి.. వెంటపడుతుంటుంది. మరి ఈ ముక్కోణపు ప్రేమకథ అలా ఎన్ని మలుపులు తిరిగింది? ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా? లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా? లేదంటే ఊహలకు అందనివిధంగా ఇంకేమైనా జరిగిందా? అన్నది మిగిలిన కథ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa