ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలా కావాలంటే అలా చేశా…

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2019, 12:02 PM

మూడు దశాబ్దాల నట ప్రయాణంలో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించింది అందాల తార టబూ. విమర్శకులను ఆకట్టుకుని రెండు జాతీయ పురస్కారాలు పొందింది. ఇంత అనుభవం ఉన్నా…ఇప్పటికీ కొత్త చిత్రం అంగీకరించే ముందు చాలా ప్రశ్నలు తనలో వేసుకుంటానని చెప్పింది. నటిగా తాను ఎలా కావాలంటే అలా నటించానని తెలిపింది. తాజాగా ఓ ముఖాముఖిలో టబూ మాట్లాడుతూ….ఓ సినిమా అంగీకరించే ముందు ఈ సినిమాలో నటిస్తే, నటించకుంటే ఎలా ఉంటుంది అనే ప్రశ్న నాకు నేను వేసుకుంటా. ఇది నా మీద నాకు సందేహంతో కాదు. ఒకటికి రెండు సార్లు సరిచూసుకునేందుకే. చిత్రంలో నటించేందుకు, వద్దనేందుకు కారణాలేంటో విశ్లేషిస్తా. ఇవి ఆలోచించాక…ఒప్పుకోవచ్చు అనుకుంటే ముందుకెళ్తా. ఏం చేసినా సినిమా జయాపజయాలు మనకు దక్కే అవకాశం మాత్రమే. ఎత్తుపల్లాలు ప్రతి వృత్తిలో సహజమే. అపజయాలు వచ్చినప్పుడు నేనేదో కోల్పోయాను, త్యాగం చేశాను అనుకోను. ఇక్కడ నాకు నచ్చినది చేశా, నచ్చనిది వదిలేశా. ఏ పాత్రలో నటించినా, ఎలా మెప్పించినా అది నా ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమైంది. వ్యాపారాత్మక ధోరణి నాలో లేదు. అని చెప్పింది. మాచిస్‌, విరాసత్‌, అస్తిత్వ, చాందినీ బార్‌, లైఫ్‌ ఆఫ్‌ పై, మక్భూల్‌, చీనీ కమ్‌, హైడర్‌, దృశ్యమ్‌, అంధదూన్‌ లాంటి చిత్రాలతో టబూ నటిగా పేరు తెచ్చుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa