ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేషన్స్ లో కొత్త మార్పు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 06:44 AM

ప్రముఖ రియాలిటీ షోస్ లో ఒకటైన బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 2025 మొదటి వారంలో కిక్-స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. బిగ్ బాస్ 9 తెలుగు మొదటి వారంలోనే ఒక ప్రధాన మలుపుతో అభిమానులకు షాక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఈ షో చరిత్రలో మొదటిసారి, గ్రాండ్ ప్రీమియర్ తర్వాత మూడు రోజుల తరువాత ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ ధైర్యమైన చర్య షోలో ఆసక్తిని పెంచటానికి కొత్తగా ప్రవేశపెట్టిన నియమాలలో భాగంగా వస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ కొత్త సీజన్ హై-వోల్టేజ్ డ్రామాను వాగ్దానం చేస్తుంది. అధికారిక నిర్ధారణ ఇంకా చేయనప్పటికీ ఈ వార్త ఫిల్మ్ సర్కిల్‌లలో వైరల్ అవుతుంది. ఈ షోకి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa