ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సుందరకాండ' లోని డియర్ ఐర సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 25, 2025, 04:07 PM

టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ 20వ చిత్రం "సుందరకాండ" తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి వెంకటేష్ని మ్మలపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని డియర్ ఐర సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో రోహిత్ సరసన వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీ దేవి విజయ్ కుమార్ ఆమె తల్లిగా నటించారు. ఈ చిత్రంలో నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కాగా, రాజేష్ పెంటకోట ప్రొడక్షన్ డిజైనర్, రోహన్ చిల్లాలే ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి  పృథ్వీ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ, విశ్వ రఘు డ్యాన్స్ కొరియోగ్రఫీని నిర్వహించగా, నాగు తలారి VFX సూపర్‌వైజర్‌గా ఉన్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా, ప్రదీష్ ఎమ్ వర్మ చిత్ర విజువల్స్‌ను సంగ్రహించారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళ్ళ త్రయం ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఆగష్టు 27న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa