ఒకప్పుడు తెలుగు లో వరుస చిత్రాలతో దూసుకెళ్లిన తాప్సీ పన్ను ఇప్పుడు సౌత్ మరియు నార్త్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాప్సీ ప్రస్తుతం ప్రేమలో ఉందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. అయితే అందరూ అనుకుంటున్నట్టు తన ప్రేమికుడు క్రికెటర్, సినిమా రంగానికి చెందిన వాడు కాదట. తాజాగా జరిగిన ఓ ఛాట్ షోలో తాప్సీ తన ప్రియుడి గురించి మాట్లాడింది. `పుకార్ల కోసం, వార్తల కోసం కాకుండా నిజాయితీగా నా గురించి తెలుసుకోవాలనే వారి గురించి మాట్లాడుతున్నా. నేను ప్రేమలో ఉన్నా. అయితే అందరూ అనుకుంటున్నట్టు అతను క్రికెటర్, నటుడు కాదు. అతను అసలు ఈ ప్రాంతంలోనే ఉండడు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంటాను అని తాప్సీ చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa