అశ్విన్ చంద్రశేకర్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో సంతోష్ సోభన్ సరసన జోడిగా మనసా వారణాసి జోడిగా నటించారు. తెలుగు మరియు తమిళ భాషలలో త్వరలో గొప్ప థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని నాలో నేను అనే టైటిల్ తో విడుదల చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ ప్రదర్శనలో యువి కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. సినిమాటోగ్రఫీని దినేష్ పురుషుతమన్ నిర్వహిస్తుండగా, సంగీతాన్ని ఆదిత్య రవీంద్రన్ స్కోర్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa