సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 'దర్బార్' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తాజాగా సెకండ్ లుక్ ను వదిలారు. ఈ పోస్టర్లో రజనీ యాక్షన్ లుక్ ఆకట్టుకునేదిలా వుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. 'పేట' సక్సెస్ తరువాత రజనీ .. 'సర్కార్' సంచలన విజయం తరువాత విజయ్ చేస్తోన్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa