ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ కు విజయ్ 'బిగిల్ ' తెలుగు హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2019, 07:24 PM

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన  'మెర్సల్','తెరి' చిత్రాలు సంచలన విజయాలను సాధించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా 'బిగిల్' చిత్రం రూపొందుతోంది. క్రీడా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా నయనతార కనిపించనుంది. కల్పాతి అఘోరామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను దీపావళికి భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను మహేశ్ కోనేరు దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన ఫ్యాన్సీ రేటును చెల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు స్పందిస్తూ ..'బిగిల్' సినిమా తెలుగు హక్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ కి దక్కడం ఆనందంగా వుంది. ఇందుకు కారకులైన విజయ్ కి .. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నాము. త్వరలోనే తెలుగు టైటిల్ ను ప్రకటిస్తాము" అని ఆయన చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa