నిర్మాత అల్లు అరవింద్‌ను ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ శనివారం మరణించిన విషయం తెలిసిందే. అల్లు కనకరత్నమ్మ కన్నుమూయడంతో మోహన్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిన మోహన్ బాబు కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa