నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ నటించిన '35 చిన్న కథ కాదు' మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను టీచర్స్ డే కానుకగా రానా దగ్గుబాటి ప్రకటించారు. ఓ తల్లి తన కుమారుడికి 35 మార్కులు తెప్పించేందుకు చేసిన పోరాటాన్ని ఇందులో చక్కగా చూపించారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈ సినిమా చూసే అవకాశం ఆడియన్స్‌కు దక్కనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa