విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. సింగరేణి మైనింగ్ క్షేత్రాల నేపథ్యంలో ఈ చిత్రం సిద్దమవుతోందని, దేవరకొండ ఇక్కడి కార్మికులతో ప్రత్యేకంగా మాట్లాడి పలు ఎమోషన్ సీన్లని తయారు చేసుకున్నట్టు వినవస్తోంది. కాగా ఈ చిత్రం టైటిల్ ఏమిటన్నది ఇంతవరకు గోప్యంగా ఉంచిన నిర్మాతలు 17 ఉదయం 11 గంటలకు ఏకంగా పోస్టర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాబోయే రోజులలో వినూత్న ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa