ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ హోస్ట్‌గా లక్ష్మి మంచు

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2019, 03:32 AM

 గ‌తంలో ప‌లు టివి షోల‌కు హోస్టుగా వ్య‌వ‌హ‌రించిన న‌టి లక్ష్మి మంచు  తాజాగా సెప్టెంబర్ 23 నుండి VOOT లో ప్రసారం ప్రారంభించే  "ఫీట్ అప్ విత్ ది స్టార్స్" అనే చాట్ షో కి హోస్టు చేసేందుకు సిద్ద‌మైంది.
ఈవిష‌యాన్ని ఆమే స్వ‌యంగా మీడియాకు వివ‌రిస్తూ,  "'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' యొక్క తెలుగు ఎడిషన్‌ను హోస్ట్ చేయడానికి  న‌న్ను ఎంపిక చేయ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు.  ఈ కార్య‌క్ర‌మంలో సెల‌బ్ర‌టీల‌ను ఇంట‌ర్వూలు చేసి సాధార‌ణ కార్య‌క్ర‌మ‌మ‌ని అంతా భావించినా, ఇది చాలా ప్రత్యేకమైనదని తెలిపారామె.   మీ అభిమానులే త‌మ స్టార్ల‌ను నేరుగా ప్ర‌శ్నిస్తార‌ని,  ప్రముఖులు సైతం దాపరికం లేని జ‌వాబులు ఇవ్వ‌డంతో పాటు   వారి రహస్యాలు కూడా అభిమానుల‌తో పంచుకోవడానికి  ఇదిసరైన  వేదిక‌గా నిలుస్తుంద‌ని లక్ష్మి అన్నారు.
"ఇది అభిమానులను వారి అభిమాన ప్రముఖులను ఒక‌ దగ్గరికి తీసుకువచ్చే సరదా ప్రయాణం అని, త‌న‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ప‌రిచ‌యాల   వారిలో చాలా మంది నా స్నేహితులు,  పరిశ్రమకు చెందిన సహచరులు , వారి వారి అభిమానులు  సరదాగా సంభాషించే  ఆసక్తికరమైన ఈ ప్రోగ్రాం ఎప్పుడెప్పుడు ఆరంభ‌మ‌వుతుందా అని మీలాగే నేను కూడా   ఎదురు చూస్తున్నాను ష‌అ  ఆమె తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa