by Suryaa Desk | Tue, Oct 15, 2024, 12:39 PM
వైవిధ్యమైన కథలు ఎంచుకునే హీరోల్లో సాయి ధర్మ తేజ్ ఒకరు. 'విరూపాక్ష', 'బ్రో' తర్వాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.నేడు ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. #SDT18 వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. 'హనుమాన్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. 'ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే' అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను విడుదల చేస్తూ చిత్రబృందం సాయి దుర్గా తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
It’s a long wait for the Battle Grounds
I’m here now... #SDT18 @AishuL_ @rohithkp_dir @vetrivisuals @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/a5XvU1qmTa
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2024