by Suryaa Desk | Tue, Oct 15, 2024, 12:44 PM
సమంత నిర్మించి, నటిస్తున్న మూవీ మా ఇంటి బంగారం. ఇదో ఓ ఫిమేల్ సెంట్రిక్ కథతో రానుంది. షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ కాకుండా ఇప్పుడు మరో సినిమా ద్వారా కూడా సమంత వార్తల్లో నిలుస్తోంది.సమంత కొన్నాళ్ల కిందట ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ బ్యానర్ లోనే ఇప్పుడీ మా ఇంటి బంగారం అనే చిన్న బడ్జెట్ మూవీ రాబోతోంది. దీని తర్వాత సమంత మరో సినిమాను కూడా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండకు మెయిన్ లీడ్ గా అవకాశం ఇచ్చినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.ప్రియదర్శి పులికొండ ఇప్పటికే తెలుగులో ఎన్నో మంచి మూవీస్ లో నటించాడు. కంటెంట్ నే నమ్ముకొని సినిమాలకు ఓకే చెప్పే నటుడిగా అతడు నిలుస్తున్నాడు. దీంతో సమంత తన నెక్ట్స్ మూవీలో ప్రియదర్శిని హీరోగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా తెలుగులో ఆమె మరిన్ని లోబడ్జెట్ సినిమాలను కూడా తీయబోతున్నట్లు కూడా ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది.
అంతేకాదు తెలుగులో ఓ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతానికి ప్రియదర్శితో మూవీని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సమంత వచ్చే నెలలో సిటడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు సమంత మరో హిందీ మూవీలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించనున్నట్లు కూడా సమాచారం.
Latest News