by Suryaa Desk | Tue, Oct 15, 2024, 01:03 PM
జోహార్ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్ 'కోట బొమ్మాళి PS' విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొంది నవంబర్‌లో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ సాధించింది. ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 15న సాయంత్రం 6 గంటలకి స్టార్ మా మూవీస్ ఛానల్ లో ప్రసారం కానుంది. మురళీ శర్మ, విష్ణు ఓయి, దయానంద్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. 2 గంటల 25 నిమిషాల రన్‌టైమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం IMDbలో 7.7/10 రేటింగ్‌లను అందుకుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళ చిత్రం నయట్టు యొక్క రీమేక్. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం సమకుర్చారు. కోట బొమ్మాళి పిఎస్‌ని జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.
Latest News