by Suryaa Desk | Thu, Oct 17, 2024, 12:30 PM
రాధిక ఆప్టేకి పెళ్లి అయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె సైతం తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అందుకే చాలా మందికి అసలు ఆమెకు పెళ్లి కాలేదని అనుకుంటారు. కానీ ఆమెకు పన్నెండేళ్ల క్రితమే పెళ్లి అయింది. లండన్ మ్యూజీషియన్ అయిన బెనడిక్ట్‌ను రాధిక ప్రేమించి, డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయన లండన్‌లోనే ఉంటాడు. కానీ రాధిక ఇలా సినిమాల కోసం ముంబైలోనే ఉంటుంది. సమయం చిక్కినప్పుడల్లా రాధిక లండన్ వెళ్లి వస్తుంటుంది.ఇక రాధిక ఇలా సడెన్‌గా బేబీ బంప్‌తో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. సిస్టర్ మిడ్ నైట్ మూవీ యూకే ప్రీమియర్లలో భాగంగా ఇలా రెడ్ కార్పెట్ మీద కనిపించడం, బేబీ బంబప్‌తో దర్శనం ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతోన్నారు. ఇంత వరకు తన ప్రెగ్నెన్సీ గురించి రాధికా ఆప్టే ఎవ్వరికీ చెప్పలేదు. ఎక్కడా ఓ పోస్ట్ కూడా వేయలేదు. ఇలా నేరుగా రెడ్ కార్పెట్ మీద పోజులు పెడుతున్న సమయంలోనే ఇలా కనిపించింది.
Latest News