by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:40 PM
దర్శకుడు శ్రీను వైట్ల హిట్ ట్రాక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలకు ఓ బ్రాండ్‌గా ఓ వెలుగు వెలిగారు. అయితే 'దూకుడు’ తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ విజయం లేదు. అయినప్పటికీ అవకాశాలు అందుకుంటూ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన చిత్రం 'విశ్వం’. కమర్షియల్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన మాచోస్టార్ గోపీచంద్ తో శ్రీనువైట్ల చాలాకాలంగా సినిమా ప్లాన్ చేశారు. దసరా కానుకగా రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ క్రమంలో యాక్టర్ నరేష్ మాట్లాడుతూ.. ట్రోలర్స్‌కి మరోసారి మంచి కంటెంట్ అందించాడు. ఇంతకీ ఏమైందంటే.. ఒక సినిమాని, హీరోని లేదా ఇంకేదైనా విషయాన్నీ నరేష్ ఎలివేట్ చేసి చెప్పే స్టైలే వేరు. ఇలా ప్రతి ఈవెంట్లో ఎదో రచ్చ చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. తాజాగా జరిగిన 'విశ్వం' సక్సెస్ మీట్‌లో నరేష్ మాట్లాడుతూ.. "దసరా కానుకగా రిలీజైన 'విశ్వం' సినిమా 2024లో ఏకైక సూపర్ హిట్" అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో మరి దేవర, కల్కి, టిల్లు స్క్వేర్, హనుమాన్ సినిమాలేంటని సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నారు. వాస్తవానికి నరేష్ ఉద్దేశం 'విశ్వం' దసరా విన్నర్ అని అనౌన్స్ చేయడం. కానీ.. ఎప్పటిలాగే టంగ్ స్లిప్ అయిన నరేష్ మరోసారి ట్రోలర్స్‌కి బలయ్యాడు. గతంలోనూ నరేష్ ఓ సినిమా ఈవెంట్‌లో దమ్ముంటే మా సినిమా పైరసీ చేయండని ఛాలెంజ్ చేశాడు. మా సినిమా యూనిట్ & ఓటీటీ సంస్థ కలిసి పైరసీ చేయలేని విధంగా సినిమాని తాయారు చేశామన్నారు. కాగా నెక్స్ట్ డేనే సినిమా పైరసీ సైట్‌లలో కనిపించడంతో కంగుతిన్నాడు.
Latest News