by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:43 PM
'మిస్ ఇండియా 2024' పోటీలు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఘనంగా ముగిశాయి. దేశంలోని 29 రాష్ట్రాలతో పాటు 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముద్దగుమ్మలు ఈ పోటీలో పాల్గొన్నారు. 2023 మిస్ ఇండియా నందిని గుప్త .. విన్నర్ కి కిరీటాన్ని అందించారు. బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా శాశ్ అందించారు. ఇక ఈ సిజ్లింగ్ బ్యూటీస్ తమ అందాలతో ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేశారు. ఇంతకీ మిస్ ఇండియా 2024 విన్నర్ ఎవరంటే..మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ మిస్ ఇండియా 2024 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇప్పుడు నేను అనుభవిస్తోన్న ఆనందాన్ని వర్ణించలేను. ఇదంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. కానీ నా తల్లిదండ్రుల కళ్లలోని ఆనందం చూసి గర్వంగా ఉంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా నేను సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయి’’ అంటూ ఉద్వేగానికి గురైంది. ఇదిలా ఉండగా నిఖిత మిస్ ఇండియా పోటీల్లో భాగంగా అడిగిన ప్రశ్నలలో తనకు ఇష్టమైన నటి ఎవరని అడిగితే ఐశ్వర్యరాయ్ బచ్చన్ అని చెప్పింది. తనకు సంజయ్ లీలా బన్సాలీ చిత్రంలో నటించాలని కోరిక అని తెలిపింది. ఈమెకు పెయింటింగ్, సినిమాలు, రాయడం అంటే ఇష్టమట. నిఖిత 250 పేజీల కృష్ణ లీల నాటకం కూడా రాసింది. ఇక, రన్నరప్‌లు రేఖ స్వస్థలం దాద్రా అండ్ నగర్ హవేలీ కాగా.. ఆయుశీది గుజరాత్.
Latest News