by Suryaa Desk | Thu, Oct 17, 2024, 11:47 PM
యాంకర్ ప్రదీప్ బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అమ్మాయిలు, యూత్‌లోను కల్ట్ ఫాలోయింగ్ సాధించాడు. స్మాల్ స్క్రీన్‌పై షోస్ చేస్తూనే.. సిల్వర్ స్క్రీన్‌పై అడపాదడపా క్యారెక్టర్స్ చేశాడు. 2021లో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసి పర్వాలేదనిపించాడు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నా అభిమానులకి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మధ్యకాలంలో షోస్ కూడా తగ్గించాడు. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అలాగే ఈ సినిమాకి ఓ 'పవన్ కళ్యాణ్' సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. టైటిల్ ఏంటంటే..ప్రదీప్ తన మొదటి సినిమాతోనే విభిన్నమైన స్టోరీతో ఆకట్టుకున్నాడు.
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా వచ్చి నాలుగేళ్ళ అయిన నెక్స్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాలేదు. తాజాగా తెలుగు కామెడీ షో 'జబ్బర్దస్త్' డైరెక్టర్స్ నితిన్, భరత్‌ల దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కూడా విభిన్నమైన లవ్ స్టోరీతో పాటు కామెడీ ట్రాక్ కలిగి ఉంటుందని ఇండస్ట్రీ లీక్. ఇక ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ ని ఓకే చేశారు. దీంతో ఆడియెన్స్ వీపరీతమైన బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాంక్స్ & మంకీస్ నిర్మిస్తున్నారు.
Latest News