by Suryaa Desk | Tue, Aug 13, 2024, 10:54 AM
జోగులాంబ గద్వాల జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు సోమవారం ఆకస్మికoగా సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని, అత్యవసర పరిస్థితులలో వినియోగించే డయల్ 100కు బ్లూ కోల్డ్ సిబ్బంది వెంటనే స్పందించాలని, స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా ప్రవర్తించి తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.