అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa