కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున ఓ వ్యాన్ లో తరలిస్తున్న రాయితీ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎన్ఫోర్సుమెంట్ డీటీ శ్రీనివాస్ తెలిపారు. బియ్యం, వ్యాన్ను రెబ్బెన పోలీసుస్టేషన్లో అప్పజెప్పామని సెలవు దినం కావడంతో పంచనామా నిర్వహించలేదని, పట్టుకున్న బియ్యం సుమారు 40 క్వింటాళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు డీటీ శ్రీనివాస్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa