పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ దృష్ట్యా పిట్లం మండలంలోని రాంపూర్(కలన్) గ్రామ శివారులోని బాన్సువాడ రోడ్డులో ఆదివారం పోలీసులు మమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్లం మండల ఎలక్షన్ అబ్జర్వర్ మనోహర్ మాట్లాడుతూ.. ఎవరైనా అధిక మొత్తంలో డబ్బులు, బంగారం, అక్రమ మద్యం వంటివి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa