నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వెల్టూరు గ్రామంలో శనివారం జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు 600 రూపాయల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa