బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున్న సంబరాలు చేసుకొంటున్నారు. ఇదిలావుంటే తాను ఈ స్థాయికి వస్తానని అస్సలు ఊహించలేదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. ఆయనకు మోదీ క్యాబినెట్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించిన మోదీకి, బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు... ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనను గెలిపించిన కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa