నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో అవకతవకలపై ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa