మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ఇద్దరు గర్భవతులకు సోకింది. జికా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో ఆ రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమైంది. పూణె మున్సిపల్ అధికారులు వైరస్ నివారణకు చర్యలు ప్రారంభించారు. తెలంగాణకు మహారాష్ట్ర పక్కరాష్ట్రం కావడం, పైగా ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు సమీపంలోనే ఉండటం వల్ల రెండు జిల్లాల్లో అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa