సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 5వ తేదీన ఆరుద్ర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. ఉదయం 10 గంటలకు అన్నాభిషేకం, ఫలాభిషేకం జరుగుతుందని చెప్పారు. రాత్రి 7 గంటలకు భస్మాభిషేకం జరుగుతుందని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa