నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నీటి సదుపాయం కల్పించేందుకు కొత్త బోరు వేయిస్తానని అదేవిధంగా మూత్రశాల సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa