ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నానికి చెందిన పి.వినోద్ ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. యువకుడిపై వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదు కాగా.. విచారణలో వినోద్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa