సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కనిపించిన దేవుడికల్లా మొక్కుతూ.. ఎంత ఖర్చయినా రకరకాల ఆస్పత్రులకు తిరురుగుతూ.. ఎప్పుడెప్పుడు తమ కడుపు పండుతుందా.. ఎప్పుడెప్పుడు తమ చేతులతో సంతానాన్ని ఎత్తుకుని ముద్దాడాలా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ.. కొంతమంది మాత్రం తమకు కలిగిన సంతానాన్ని ఎంతో కర్కషంగా.. రక్తపు మరకలు ఆరిపోకముందే ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లిపోతున్నారు. అలాంటి అమానుష ఘటన చోటుచేసుకుంది మేడ్చల్ జిల్లాలోని గౌడవెల్లి గ్రామంలో. చీమలు కొరికి, ముళ్లు గుచ్చుకుని.. ఒళ్లంతా రక్తంతో.. అప్పుడే పుట్టిన ఆడశిశువును చెట్లపొదల్లో పడేసి వెళ్లిపోవటం.. స్థానికులకు తీవ్రంగా కలిచివేసింది. ఆ పసికందు ఏడుపు ఓ ఆటోడ్రైవర్ చెవిన పడటంతో ఆ శిశువు గురించి తెలిసింది.
గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద ఆటోడ్రైవర్ అటువైపుగా వెళ్తుండగా.. శిశువు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది. దీంతో.. ఆ ఆటోడ్రైవర్ వెంటననే స్థానికులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు గ్రామ కార్యదర్శి మహిపాల్ రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న కార్యదర్శి.. తన సిబ్బందితో హుటాహుటిన ఆ ముళ్ల పొదల వద్దకు చేరుకుని వెళకగా.. ఒళ్లంతా రక్తంతో ఆడశిశువు రోదిస్తూ కనబడింది.
స్థానిక ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశావర్కర్ లక్ష్మిని పిలిపించి.. శిశువును పొదల నుంచి బయటికి తీశారు. అప్పటికే శిశువుకు ముళ్లు గుచ్చుకు పోవడంతో పాటు చీమలు పట్టి గాయాలు కావటంతో.. శిశువును హుటాహుటిన ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఆ పసికందు తల్లిదండ్రుల గూర్చి ఆరాతీయగా.. అక్కడే ఉన్న ఛత్తీస్‌గడ్‌కు చెందిన వ్యక్తులు.. శిశువును పడేసిన వారి వివరాలు చెప్పడంతో.. పౌల్ట్రీఫాం వద్దకు వెళ్లారు. తులసితో పాటు ఆమె భర్తను నిలదీశారు.
దీంతో.. శిశువు తమదేనని ఒప్పుకోవడంతో తులసిని బిడ్డతో పాటు మేడ్చల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆమె భర్త సంతోష్‌ను మేడ్చల్ పోలీసులకు అప్పగించారు. అయితే.. తమకు పుట్టిన బిడ్డ చనిపోయిందనుకుని.. కాగితంలో చుట్టేసి పొదల్లో వదిలేశానని, అయితే శిశువు బతికుందని అధికారులు తెలపడంతో తానే పెంచుకుంటానని తులసి తెలిపింది.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌కు చెందిన తులసి, సంతోష్ దంపతులు.. ఆరేళ్లుగా గౌడవెల్లి గ్రామ సమీపంలోని స్టార్ పౌల్ట్రీ ఫాంలో కూలీలుగా పనిచేస్తున్నారు. తులసి గర్భిణి కావడంతో భర్త సంతోష్ వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను సోమవారం మేడ్చల్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. తిరిగి పౌల్ట్రీఫామ్‌కు వెళ్తుండగా తులసికి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో మార్గమధ్యలోనే తులసికి ఆడ శిశువును జన్మనిచ్చింది.
ఆడపిల్ల పుట్టటం ఇష్టం లేకనో.. లేకా వాళ్లు చెప్తున్నట్టుగా శిశువు ఎలాంటి అలికిడి చేయకపోవటంతో వల్ల చనిపోయిందనుకున్నారో.. ఆ పసికందును కాగితంలో చుట్టేసి రోడ్డుపక్కన ఉన్న ముళ్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మొత్తానికి.. ఆ చిన్నారి.. ముళ్ల పొదల నుంచి తల్లి ఒళ్లోకి చేరటంతో.. కథ సుఖాంతమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa