నల్గొండ జిల్లాలో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల పిలుపుతో పట్టణంలో సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసి లేబర్ కోడ్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం ఎండి సలీం, దండం పెళ్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa