ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దొంగతనాలు జరగకుండా ఉండేందుకు,,,,ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 06:50 PM

బతుకమ్మ, దసరా పండుగలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రేపో మాపో సూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. దీంతో.. హైదరాబాద్‌ నగరంలో నివాసముంటున్న చాలా మంది.. సొంతూళ్లకు ప్రయాణం కానున్నారు. నగరం చాలా వరకు ఖాళీ కానుంది. పండుగలను ఎంజాయ్ చేసేందుకు అందరూ ఎంతో సంతోషంగా ఊర్లకు వెళ్తే.. ఇదే అదునుగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలోనూ.. ఇలాగే పండగ వేళ అందరూ ఊర్లకు వెళ్లగా.. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా భారీ ఎత్తున దొంగతనాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. ఆ అనుభవాలను పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ముందస్తుగానే అప్రమత్తమయ్యారు. ఊర్లకు వెళ్లే వారికి కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు.


పండగకు ఊరు వెళ్లే వారికి హైదరాబాద్ పోలీసులు ఇస్తున్న ముఖ్యమైన సలహాలివే..


దసరా పండుగ సెలవులకు ఊరు వెళ్లాల్సి వస్తే మీ విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి.


సెలవులలో బయటకు వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచింది.


మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళం అమర్చుకోవడం మంచిది.


తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ దగ్గర్లోని పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి.


మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. లేదా డయల్ 100 కు ఫోన్ చేయండి.


మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకొండి. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి, వీలైతే చక్రాలకు చైన్స్‌తో కూడా లాక్ వేయడం మంచిది.


నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి.


మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్ లైన్లో లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి.


మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్లు, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. వాటిని కూడా గమనించి దొంగతనాలకు పాల్పడుతారు అన్న విషయాన్ని గమనించండి.


మెయిన్ డోర్‌కి తాళం వేసినప్పటికీ అవి కనిపించకుండా కర్టెన్స్‌తో కవర్ చేయడం మంచిది.


బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది.


మీ ఇంటి దగ్గర మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మంచిది.


మీ ఇంటికి వచ్చే, వెళ్లే దారులు, ఇంటిలోపల సీసీ కెమెరాలు అమర్చుకొని డీవీఆర్ కనపడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో ఉంచండి.


అల్మరా, కబోర్డ్స్‌కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పుల స్టాండ్, పరుపులు, దిండ్ల కింద, అల్మరాపైన, డ్రెస్సింగ్ టేబుల్‌లో, కబొర్డ్స్‌లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం మంచిది.


బంగారు ఆభరణాలు వేసుకొని ఫంక్షన్‌లకు వెళ్లేటప్పుడు తగు జాగ్రతలు తీసుకోండి.


సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు.


కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి.


మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు గాని, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూం 9490617100 కు లేదా వాట్సాప్ నెంబర్ 9490617444 కు డయల్ చేయండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa