నిరుపేద పిల్లలకి నాణ్యమైన విద్యను అందిస్తున్న డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ సేవలు అభినందనీయమని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు . మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన స్కూల్ బస్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
డ్రీంఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థపాకురాలు చావా అరుణ మాట్లాడుతూ..నిరుపేద విద్యార్థులకు విద్యా అవకాశాలు , మెరుగైన భవిష్యత్తు కోసం సంస్థ తమ ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తుందని అన్నారు. బస్సు కొనుగోలుకు చేయూత నందించిన దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముమ్మలనేని రాజశేఖర్ ఉదయ బిల్డర్ ,లయన్అశోక్ గౌడ్, రామస్వామి, లయన్ దేవేందర్ రెడ్డి, లయన్ సురేష్, గోకుల్ ప్లాట్స్ కాలనీ నివాసులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa