ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మవారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి...ఎమ్మెల్యే కెపి.వివేకానంద్...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:33 PM

సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం ఓం జెండా,  మైత్రి నగర్, సూరారం సుందర్ నగర్ లో లలో ఏర్పాటు చేసిన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలవడం ద్వారా సుఖసంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయన్నారు.
కొలిచిన వారి కొంగు బంగారం దుర్గా అమ్మవారు అని అన్నారు. అమ్మవారి దయతో ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్లు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు వారాల వినోద్, పెద్ద వెంకటస్వామి, చిన్న వెంకటస్వామి, ఆయా కాలనీలవాసులు అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa