రోడ్డు అంచున కూర్చున్న ముగ్గురు యువకులను ఓ కారు మెరుపు వేగంతో వచ్చి ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన ఈ నెల 5వ తేదీన జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. యూపీలోని ఫరూఖాబాద్‌లో రోడ్డు పక్కన కూర్చున్న ముగ్గురు యువకులను కారు దారుణంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa